BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 30 January 2026, 10:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

తెలంగాణ
30 Jan, 2026 - 10:23 AM
222 వీక్షణలు
ధర్మపురిపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ కావాలి NTODAY NEWS: ధర్మపురి  ధర్మపురి పురపాలికపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం ధర్మపురి పట్టణంలోని పలు వార్డుల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసిన మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధే కాంగ్రెస్ నినాదం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. పట్టణాన్ని మరింత సుందరంగా, సకల సౌకర్యాలతో అభివృద్ధి చేయాలంటే మున్సిపాలిటీలో కాంగ్రెస్ పాలన అవసరమని అన్నారు. 15 వార్డులలోనూ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ఓటర్లను కోరారు. ప్రచారంలో భాగంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాలను మంత్రి సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించారు. కాంగ్రెస్‌లోకి యువ నాయకుల చేరిక మంత్రి సమక్షంలో ధర్మపురి పట్టణానికి చెందిన ఒడ్డెర యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఓల్లెపు శంకర్ రాజుతో పాటు పలువురు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఒడ్డెర యువజన సంఘం మండల అధ్యక్షుడు తాపళ్ల శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శంకర్ రాజు, సంపంగి రవి, ఉప్పుల శివ, దండ్ల రాజేష్, సంపంగి శేఖర్, సంపంగి సంజీవ్ తదితరులకు మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మండల, పట్టణ కాంగ్రెస్ నాయకులు, నియోజకవర్గ ముఖ్య నేతలు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #CongressParty #MunicipalElections #Dharmapuri #AdluriLaxmanKumar #CongressCampaign #UrbanDevelopment #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube