BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 February 2026, 08:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ అడుగులు

తెలంగాణ
06 Feb, 2026 - 08:12 AM
280 వీక్షణలు
ధర్మపురి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ అడుగులు అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ధర్మపురి పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 6, 7వ వార్డుల పరిధిలోని ఇందిరమ్మ కాలనీ (కమలాపూర్ రోడ్)లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రచార సభలో మంత్రి మాట్లాడుతూ, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులైన పేదలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. అలాగే, 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే పేద కుటుంబాలకు ప్రభుత్వం విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ ఆర్థిక భారం తగ్గిస్తోందని పేర్కొన్నారు. సంక్షేమ పాలనతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముడేళ్ళల్లో పట్టణ రూపురేఖలు మారుస్తాం ధర్మపురి మున్సిపాలిటీలో 15 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే, రాబోయే మూడేళ్లలో పట్టణాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం నిరుద్యోగులు, మహిళలకు సంక్షేమ శాఖ ద్వారా రుణాలు అందించి ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. #DharampuriDevelopment #CongressCampaign #MunicipalElections #PublicWelfare #TelanganaPolitics #ElectionNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube