BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 January 2026, 10:13 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

కాలువలో కలిసిన ప్రమాదకర రసాయనం

తెలంగాణ
20 Jan, 2026 - 10:13 PM
362 వీక్షణలు
తొండంగి మండలంలో ఫార్మా లారీ ప్రమాదం కాలువలో కలిసిన ప్రమాదకర రసాయనం – 16 గ్రామాలకు ముప్పు NTODAY NEWS: కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం వద్ద బుధవారం ఉదయం ఫార్మా కంపెనీకి వెళ్తున్న లోడ్ లారీ అదుపు తప్పి కాలువలో బోల్తా పడింది. లారీలోని ప్రమాదకర రసాయనం కాలువలో కలిసిపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. కాలువకు సమీపంలోనే ఏవీ నగరం పంపింగ్ స్కీం ఉండటంతో, కలుషిత నీరు పంపింగ్ స్కీంలోకి చేరితే సుమారు 16 గ్రామాల ప్రజలు ప్రభావితమయ్యే ప్రమాదం ఏర్పడింది. ఏవీ నగరం, కొమ్మనాపల్లి, రావికంపాడు తదితర గ్రామాలకు ఈ కాలువ ద్వారా నీటి సరఫరా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటిని వినియోగించవద్దని హెచ్చరికలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ కాలువ నీటిని తాగవద్దని, పశువులకు కూడా ఈ నీటిని ఇవ్వవద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. కాలువ నీరు సమీపంలోని చిన్న చెరువుల్లోకి చేరే అవకాశం ఉండటంతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. ప్రభావిత గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు ప్రారంభించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న నాయకులు ఈ ఘటనపై యనమల రామకృష్ణుడు, యనమల దివ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు ఇస్తున్నారు. ప్రమాదకర రసాయనం కారణంగా ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యమని, నీటి కలుషితాన్ని పూర్తిగా నివారించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. #ChemicalLeak #WaterContamination #LorryAccident #EnvironmentalHazard #KakinadaDistrict #Tondangi #PublicSafety #DrinkingWaterAlert #EmergencyResponse Follow us on Website Facebook Instagram YouTube