BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 10 January 2026, 10:06 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడు అరెస్ట్

తెలంగాణ
10 Jan, 2026 - 10:06 AM
369 వీక్షణలు

మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడు అరెస్ట్

ఈగల్ టీం సహకారంతో చిట్యాల పోలీసులు దాడి – 9 కిలోల ఓపియం స్వాధీనం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ శివారులోని ఒక ధాబాలో నిషేధిత మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ధాబా నిర్వాహకుడిని చిట్యాల పోలీసులు ఈగల్ టీం సహాయంతో అరెస్ట్ చేశారు. ఈ దాడిలో 9 కిలోల ఓపియం (పాపి హస్క్)ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, జాతీయ రహదారి–65పై చిట్యాల పట్టణ శివారులో ఉన్న డూన్ పంజాబీ ధాబాలో ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌కు చెందిన గుర్నిత్ సింగ్ గత కొంతకాలంగా నిషేధిత ఓపియం పాపి హస్క్‌ను కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి సుమారు 10 గంటలకు ధాబాపై దాడి చేశారు. ఈ దాడిలో గుర్నిత్ సింగ్ వాహనదారులకు ఓపియం విక్రయిస్తున్న సమయంలో పట్టుబడ్డాడు. విచారణలో నిందితుడు, జాతీయ రహదారిపై వెళ్లే లారీ డ్రైవర్ల నుంచి ఒక్క కిలో ఓపియాన్ని రూ.1,800కు కొనుగోలు చేసి, దానిని రూ.6,000కు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. ఇటీవల 10 కిలోల ఓపియం కొనుగోలు చేసి, అందులో సుమారు ఒక కిలో విక్రయించి, మిగిలిన 9 కిలోలను ధాబాలోని తన గదిలో దాచినట్లు వెల్లడించాడు. నిందితుడి వద్ద నుంచి రూ.54,000 నగదు, 9 కిలోల ఓపియం పాపి హస్క్, ఒక స్మార్ట్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దాడిని డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో నార్కెట్పల్లి సీఐ కే. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవంతమైన ఆపరేషన్‌కు పాల్పడిన ఎస్‌ఐ మామిడి రవికుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం: డీఎస్పీ శివరాం రెడ్డి మాదకద్రవ్యాల సరఫరా, విక్రయం, వినియోగం చేసే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని డీఎస్పీ స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైనా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాదకద్రవ్యాలపై సమాచారం ఉంటే 100 నంబర్‌కు లేదా 8712670266కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో నార్కెట్పల్లి సీఐ కే. నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్, మునుగోడు ఎస్‌ఐ ఇరిగి రవి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube