BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 29 November 2025, 05:56 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎన్నికల సంఘం ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించాలి

తెలంగాణ
29 Nov, 2025 - 05:56 AM
383 వీక్షణలు

రేపటి నుండి రెండవ విడత నామినేషన్ ప్రక్రియ, ఎన్నికల సంఘం ఆదేశాలను తూ. చా తప్పకుండా పాటించాలి--జిల్లా కలెక్టర్

NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు జరిగే రెండవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకి పూర్తి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ నెల 30వ తేదీ నుండి డిసెంబర్ 2 వ తేదీ వరకు భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాలకు సంబంధించిన 150 గ్రామ పంచాయతీలు, 1332 వార్డులకు జరిగే రెండవ విడత నామినేషన్ ప్రక్రియ కి సంబందించి అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారన్నారని తెలిపారు.నామినేషన్ కేంద్రంలో ఉన్న అభ్యర్థుల నుండి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని,5 గంటలకు నామినేషన్ కేంద్రం గేటుమూసివేయాలని, నామినేషన్ కేంద్రంలో రద్దీ లేకుండా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి త్వరగా పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం ఎన్నికల నిర్వహణ లో అలసత్వం వహించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.నామినేషన్ కేంద్రం నుండి 100 మీటర్ల పరిధిలో గుంపులుగా ఎవరిని అనుమతించరని తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube