BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 January 2026, 06:49 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

తెలంగాణ
25 Jan, 2026 - 06:49 AM
346 వీక్షణలు
ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యం పారిశుద్ధ్య పనులు చేపట్టిన గ్రామ పాలకవర్గం, ప్రజలు NTODAY NEWS: చిట్యాల తనను సర్పంచిగా ఎన్నుకున్న గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అన్ని రకాల అభివృద్ధి పనులు చేపడతామని చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్ తెలిపారు. చిట్యాల మండల పరిధిలోని చిన్నకాపర్తి గ్రామంలో ఆదివారం నూతనంగా ఎన్నికైన పాలకవర్గం గ్రామంలోని పలు ప్రాంతాల్లో చెత్త తొలగించి పారిశుద్ధ్య పనులు నిర్వహించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ “మన ఊరు – మన పరిశుభ్రత (ఇది మన అందరి బాధ్యత)” అనే నినాదంతో గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం, మలమూత్ర విసర్జన చేయడం, మద్యం సేవించడం వంటి చర్యలను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, గ్రామ ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లకొండ లావణ్య రఘు, వార్డు సభ్యులు పాకాల నర్సింహ, రొండి నర్సింహ, వలిగొండ కవిత సత్యనారాయణ, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్, రుద్రారపు లక్ష్మణ్, దేశాపాక మధు, ఈరమళ్ళ దయాకర్, నందిపటి పార్వతమ్మ బాలయ్య, పెర్కా నాగరాజు, మాజీ కో-ఆప్షన్ మెంబర్ మిర్యాల జగనాథ్, దశరథ, రూపాన్ని ఇద్దయ్య, ఆకుల వెంకన్న, వలిగొండ సురేష్, గంధం రవి, పొలిమేర నవీన్, జ్వాలా యూత్ అధ్యక్షుడు దేశాపాక శ్రవణ్, అన్నెపు కార్తీక్, గ్రామ పెద్దలు పాలకూరి నర్సింహ, మామిడి నర్సింహ, గ్రామ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #BestGramPanchayat #VillageDevelopment #SwachhVillage #CleanAndGreen #SanitationDrive #PublicParticipation #RuralDevelopment #Chityala #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube