BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 December 2025, 10:17 am
Posted by : NTODAY NEWS OFFICIAL

న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం

తెలంగాణ
30 Dec, 2025 - 10:17 AM
241 వీక్షణలు

న్యూ ఇయర్ వేళ ‘జీరో డ్రగ్స్’ లక్ష్యం

NTODAY NEWS: హైదరాబాద్  నిబంధనలు ఉల్లంఘిస్తే పబ్‌లు, హోటళ్ల లైసెన్సులు రద్దు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరిక నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో డ్రగ్స్ కట్టడిపై హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ‘జీరో డ్రగ్స్’ విధానమే లక్ష్యంగా కఠిన చర్యలు చేపట్టాలని సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనర్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం హెచ్-న్యూ, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, వెస్ట్ జోన్, సీసీఎస్ తదితర విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఆయా విభాగాలకు దిశానిర్దేశం చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రగ్స్ వినియోగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. “శుక్రవారం నుంచే నగరంలోని పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా బృందాలను మోహరించాం. ప్రధాన వేదికలతో పాటు సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ పార్టీలపైనా నిఘా కొనసాగుతుంది. గత రెండేళ్లలో డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి కదలికలను నిశితంగా గమనిస్తున్నాం. డ్రగ్స్ సరఫరా చేసేవారు, వాటికి అలవాటు పడిన వారి జాబితాను సిద్ధం చేసి వారిపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించాం. నగరానికి కొత్తగా వచ్చేవారి వివరాలనూ ఆరా తీస్తున్నాం” అని సీపీ తెలిపారు. వేడుకల సమయపాలనపై సీపీ హెచ్చరిస్తూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లు తప్పనిసరిగా రాత్రి 1 గంటకే మూసివేయాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వాటి లైసెన్సులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. జనసమర్థ ప్రాంతాలైన మైత్రీవనం, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, కేబీఆర్ పార్క్ సహా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పటిష్టమైన చెక్‌పోస్టులు, బ్యారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సర్వీస్ అపార్ట్‌మెంట్లు, హాస్టళ్లలో జరిగే ప్రైవేట్ వేడుకలపైనా నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు. నిఘా పేరుతో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. పోలీసులందరూ సమన్వయంతో పనిచేసి నగర పోలీసు ప్రతిష్టను మరింత పెంచాలని సీపీ సూచించారు. Follow us on Website Facebook Instagram YouTube