BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 January 2026, 07:44 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
24 Jan, 2026 - 07:44 PM
359 వీక్షణలు
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ రాయికల్‌లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు 42 సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ రూ. 7 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన రాయికల్, పేద మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం రాయికల్ పట్టణంలోని పద్మశాలి సేవా సంఘం భవనంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్‌లతో కలిసి 42 మహిళా స్వశక్తి సంఘాలకు సంబంధించిన సుమారు రూ. 11 లక్షల విలువైన వడ్డీ లేని రుణాల జంబో చెక్కును పంపిణీ చేశారు. అనంతరం రాయికల్ పట్టణంలో రూ. 7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళల సంక్షేమానికే ప్రథమ ప్రాధాన్యం మంత్రి మాట్లాడుతూ మహిళలు కుటుంబ ఆర్థిక వ్యవస్థకు పునాదిలాంటివారని, వారు ఆర్థికంగా బలపడితేనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. స్వశక్తి సంఘాల ద్వారా మహిళలు చిన్న తరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకునేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి రాయికల్ పట్టణ మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని, ఇతర మహిళలకు ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. భవిష్యత్తులో మహిళల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో మహిళా స్వశక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. #WomenEmpowerment #IndiraMahilaShakti #InterestFreeLoans #SHGWomen #WomenDevelopment #TelanganaGovernment #SocialWelfare #Rayikal #DevelopmentWorks #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube