BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 20 January 2026, 09:29 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు

తెలంగాణ
20 Jan, 2026 - 09:29 AM
265 వీక్షణలు
వాసవి కన్యకాపరమేశ్వరి దేవి పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు ఘనంగా NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఉత్తరాయణ మాఘ శుద్ధ విదియ సందర్భంగా పుంగనూరులో బజారు వీధిలో ఉన్న వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో పవిత్ర ఆత్మ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉదయం వాసవి మాత సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఆర్యవైశ్య పతాక ఆవిష్కరణ చేపట్టారు. ఆలయం నుంచి ఆర్యవైశ్యులు, మహిళలు ర్యాలీగా కోనేటి వద్దకు వెళ్లి గంగాజలాన్ని తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా 102 మంది గోత్రీకులు క్షీరాభిషేకం చేయగా, అమ్మవారి మూర్తికి అగ్నిగుండ ప్రవేశం ఘనంగా జరిగింది. విశేష పూజలు, ప్రత్యేక అలంకరణలు, అభిషేక సేవలు, మహా మంగళహారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కె. బాలసుబ్రమణ్యం, సంఘ సభ్యులు, ఆర్యవైశ్యులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #VasaviKanyakaparameswari #AtmaDinotsavam #Punganur #AryaVaishya #TempleFestival #HinduTraditions #SpiritualCelebration #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube