BREAKING
వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు
Date of Publish : 16 January 2026, 08:58 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

తెలంగాణ
16 Jan, 2026 - 08:58 AM
410 వీక్షణలు

14వ ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి

— బట్టుపల్లి అనురాధ, ఐద్వా జిల్లా కార్యదర్శి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) 14వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ మాట్లాడుతూ, 14వ జాతీయ మహాసభలు 2026 జనవరి 25 నుంచి 28 వరకు జరగనున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుగుతున్న ఈ మహాసభలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వేదికగా నిలవనుందని పేర్కొన్నారు. దేశం నలుమూలల నుంచి సుమారు 1000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరవుతారని అన్నారు. మహిళల సమస్యలపై ఆందోళన మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలు, హింస సమాజాన్ని తీవ్రమైన సవాల్‌గా మారుస్తున్నాయని ఆమె అన్నారు. మేజర్లైన యువతి–యువకులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కును కాలరాస్తూ కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మైక్రో ఫైనాన్స్ సంస్థలు పేదల నడ్డి విరుస్తున్నాయని, లక్షల సంఖ్యలో ఉన్న డ్వాక్రా మహిళల సమస్యలు రోజురోజుకీ పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మీడియాలో మహిళలను అసభ్యంగా, అశ్లీలంగా చిత్రీకరించడం, అందాల పోటీల పేరుతో మహిళను మార్కెట్ సరుకుగా మారుస్తున్న ధోరణిని తీవ్రంగా ఖండించారు. సామాజిక మార్పు అవసరం భారతీయ సమాజంలో స్త్రీలు, బాలికలపై హింస, అత్యాచారాలు ఆగాలంటే కఠినమైన చట్టాలతో పాటు సామాజిక వ్యవస్థలో మార్పు అవసరం అని అన్నారు. నయా ఉదారవాదం పెంచి పోషిస్తున్న వినిమయ సంస్కృతిపై సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పాల్గొన్నవారు ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కల్లూరి నాగమణి, జిల్లా కమిటీ సభ్యురాలు మాయ రాణి, భువనగిరి మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి, పట్టణ సహాయ కార్యదర్శి మాటూరి కవిత, ఉపాధ్యక్షురాలు గద్దె లత, వడ్డెబోయిన స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. #AIDWA #AIDWANationalConference #WomenRights #EndViolenceAgainstWomen #GenderEquality #HyderabadEvents #SocialJustice #WomenEmpowerment Follow us on Website Facebook Instagram YouTube