BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 10 January 2026, 06:10 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఎస్సీ కమిషన్ చైర్మన్ కు గజమాలతో స్వాగతం

తెలంగాణ
10 Jan, 2026 - 06:10 AM
393 వీక్షణలు

ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ బాబుకు గజమాలతో స్వాగతం

బాధితులకు న్యాయం చేయాలని వినతి NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ తొలిసారి అధికార పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ గెస్ట్ హౌస్‌లో ఆయనను పొలిమేర హరికృష్ణ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం హరికృష్ణ చైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజాసమస్యలను వివరించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భూమి ఇచ్చిన నేకునూరి చంద్రయ్యకు ఇప్పటివరకు నగదు అందలేదని, ఆ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. పథకానికి సంబంధించి నిధుల కొరత ఉన్నప్పటికీ, కమిషన్ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్‌కు ఉన్న విస్తృత అధికారాలను వినియోగించి తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ మేరకు గ్రీవెన్స్‌లో సంబంధిత పత్రాలను అందజేశారు. అదేవిధంగా పోలవరం ముంపు బాధితులకు సంబంధించిన సమస్యలను కూడా హరికృష్ణ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వేలేరుపాడు మండలం రుద్రంపేట గ్రామానికి చెందిన వీరయ్యకు సంబంధించిన సర్వే నెంబర్లు 69, 49లోని భూములకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద కొంత మొత్తం మాత్రమే అందిందని, ఇంకా ఎక్కువ మొత్తంలో పరిహారం రావాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాలను పరిశీలించి బాధితులకు రావాల్సిన మొత్తాన్ని త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. Follow us on Website Facebook Instagram YouTube