BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

ప్రభుత్వ సహాయం కోరుతున్న బాధితులు

తెలంగాణ
09 Jan, 2026 - 09:26 AM
226 వీక్షణలు

ఆవు మృతి చెందడంతో తీవ్ర విషాదంలో బెల్దార్ కుటుంబం

ప్రభుత్వ సహాయం కోరుతున్న బాధితులు NTODAY NEWS:  అమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు అమడగూరు మండల పరిధిలోని లోకోజుపల్లి గ్రామానికి చెందిన ఎస్. బందిగి సాబ్ (ఎస్. అబ్దుల్ ఖాదర్ కుమారుడు) బెల్దార్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగించేవారు. సుమారు ఏడాది క్రితం నరాల బలహీనత కారణంగా కాలు, చేయి పనిచేయకపోవడంతో బెంగళూరులోని NIMHANS ఆసుపత్రిలో మెడ వెనుక శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు శారీరక శ్రమతో కూడిన బెల్దార్ పని చేయవద్దని చెప్పడంతో కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని వెతికారు. ఈ క్రమంలో డ్వాక్రా సంఘం ద్వారా రూ.70,000 రుణం తీసుకుని సుమారు 20 రోజుల క్రితం ఒక సీమ ఆవును కొనుగోలు చేశారు. అయితే ఆరు రోజుల క్రితం ఆవు కాన్పు సమయంలో కుర్ర దూడ అడ్డంగా తిరగడంతో వెటర్నరీ వైద్యులు చికిత్స చేసి దూడను బయటకు తీశారు. కాన్పు అయిన మరుసటి రోజే కుర్ర దూడ మృతి చెందింది. నేడు ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఆవు కూడా మృతి చెందడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. జీవనాధారం కోసం ఎంతో ఆశతో కొనుగోలు చేసిన ఆవు మృతి చెందడంతో బందిగి సాబ్‌తో పాటు కుటుంబ సభ్యులు ఆర్థికంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి తగిన సహాయం అందించాలని వారు కోరుతున్నారు. Follow us on Website Facebook Instagram YouTube