BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 27 December 2025, 07:10 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

సర్పంచులే గ్రామాభివృద్ధికి పునాది

తెలంగాణ
27 Dec, 2025 - 07:10 PM
375 వీక్షణలు

ఉపాధి హామీ పథకం పేరుమార్పుపై అభ్యంతరం

NTODAY NEWS: కరీంనగర్ జిల్లా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామపంచాయతీలు స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలుగా వ్యవహరించాలని తెలిపారు. గ్రామ అభివృద్ధి పూర్తిగా సర్పంచుల వ్యక్తిగత దయాదక్షిణ్యాలపై కాకుండా, చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రోత్సాహంతో జరగాలని అన్నారు. రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామపంచాయతీలకు కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాకుండా, నిధులు కూడా కేటాయించే విధంగా రూపకల్పన చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం, డంపింగ్ యార్డులు, ఉపాధి హామీ పథకం వంటి కార్యక్రమాలకు ఈ నిధులు ఆధారంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గ్రామీణ నిరుపేదలకు వరంగా మారిన ఉపాధి హామీ పథకం పేరును మార్చడం సరికాదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధుల కేటాయింపు నిబంధనలతో ఈ పథకం లక్ష్యం నీరుగారే ప్రమాదం ఉందని విమర్శించారు. మహాత్మ గాంధీ పేరును తొలగించి ఉపాధి హామీ పథకానికి ఇతర పేర్లు పెట్టడం సరికాదన్నారు. శ్రీరాముడు ప్రజలందరికీ ఆరాధ్య దైవమని, ఆదర్శమూర్తి అయినప్పటికీ ఆయన పేరును రాజకీయాలకు ముడివేయడం తగదని అన్నారు. మహాత్మ గాంధీ చివరి శ్వాసలో కూడా “హే రామ్” అని పలికారని గుర్తు చేస్తూ, అలాంటి మహనీయుడి పేరును తొలగించడం సమంజసం కాదన్నారు. గ్రామాల్లో ప్రధానంగా చేయాల్సిన పనులుగా మురికి కాలువల శుభ్రపరిచే పనులు, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలపై నూతన పాలకవర్గం దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీర్చాల్సిన బాధ్యత సర్పంచులపై ఉందన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేది సర్పంచులేనని పేర్కొంటూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చే దిశగా సర్పంచులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. Follow us on Website Facebook Instagram YouTube