www.ntodaynews.com
ఓటర్ లిస్ట్ పారదర్శకంగా నిర్వహించాలి
తెలంగాణ
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు, ఓటర్ లిస్ట్ పారదర్శకంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసిన దావ వసంత సురేష్ NTODAY NEWS: జగిత్యాల ఈ రోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాబోయే జగిత్యాల పట్టణం, రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు మరియు ఓటర్ లిస్ట్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా దావ వసంత సురేష్ మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తితో రిజర్వేషన్ల ప్రక్రియ జరగాలని తెలిపారు. ఓటర్ లిస్టులో అవకతవకలు చోటు చేసుకున్నాయని, గ్రామాల్లో ఉన్న ఓటర్లను పట్టణ ఓటర్ లిస్టుల్లో కూడా నమోదు చేశారని ఆరోపించారు. గ్రామాల నుంచి తప్పుగా చేర్చిన ఓట్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
వార్డుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసి సంబంధిత వర్గాలకు న్యాయం చేయాలని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి హామీ అమలు కాకపోవడం ద్వారా బీసీలను మోసం చేశారని విమర్శించారు.
బడుగు, బలహీన వర్గాలకు రావలసిన హక్కులను కాలరాసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. 42 శాతం రిజర్వేషన్లు బహుజన వర్గాల కోసం పారదర్శకంగా అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నిర్మాణం, జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి, జగిత్యాల పట్టణం మరియు రాయికల్ పట్టణ మున్సిపాలిటీల అభివృద్ధి అన్నీ కేసీఆర్ పాలనలోనే జరిగాయని చెప్పారు. గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను మున్సిపాలిటీగా మార్చి 25 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కూడా అప్పటి ప్రభుత్వ ఘనతేనని పేర్కొన్నారు.
TUFIDC ద్వారా జగిత్యాల పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కొత్త నిధులతో కాకుండా గత ప్రభుత్వంలో మంజూరైనవేనని తెలిపారు. వైద్య విద్యను పేద ప్రజల పిల్లలకు అందుబాటులోకి తీసుకురావడం, మాతా–శిశు ఆసుపత్రుల ఏర్పాటు, గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్లు అందించడం వంటి కార్యక్రమాలు కూడా అప్పటి పాలనలోనే అమలయ్యాయని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే చింతకుంట చెరువు మినీ ట్యాంక్ బండ్‌గా మారిందని, టౌన్ హాల్ పునరుద్ధరణ, రోడ్డు పనులకు ఊపొచ్చిందని తెలిపారు. జగిత్యాల పట్టణంలో పేదలకు 4520 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కనీస మౌలిక వసతులు కూడా కల్పించడంలో విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్, కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, ఎలామాద్రి కిషోర్, బీఆర్ఎస్ నాయకులు ఐల్నేని వెంకటేశ్వర్ రావు, దయాల మల్లారెడ్డి, రిజ్వాన్ యూసఫ్ ఖాన్, అనురాధ, కవిత, రంజిత్, గాజుల శ్రీనివాస్, పెండెం గంగాధర్, గంగిపెల్లి వేణు మాధవ్, కొమ్మెర మధుకర్, చెగుర్ల భగవాన్ రాజ్, ప్రణయ్, తుడిగే భారత, ప్రశాంత్, ఫహద్ తదితరులు పాల్గొన్నారు.
#Jagtial
#MunicipalElections
#VoterList
#ReservationTransparency
#BRSParty
#TelanganaPolitics
#LocalGovernance
#Raikal
#PrajaSwamyam
Follow us on
Website
Facebook
Instagram
YouTube