BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 January 2026, 08:00 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

వ్యవసాయ మోటార్ల వైర్లు, వడ్ల దొంగతనం

తెలంగాణ
24 Jan, 2026 - 08:00 PM
260 వీక్షణలు
వ్యవసాయ మోటార్ల వైర్లు, వడ్ల దొంగతనం -ఐదుగురు మహిళల అరెస్ట్ – రూ.62,500 నగదు స్వాధీనం NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల పట్టణ సమీపంలోని హస్నాబాద్ పరిధిలో రైతుల వ్యవసాయ మోటార్ల కాపర్ వైర్లు, ధాన్యం దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు మహిళా నిందితులను పట్టణ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.62,500 నగదును స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. కరుణాకర్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం: హస్నాబాద్ గ్రామానికి చెందిన రైతు బత్తుల శ్రీధర్ తన బావి వద్ద ఉన్న మోటార్ కాపర్ వైర్ దొంగతనానికి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఇదే ప్రాంతంలో మరికొంతమంది రైతుల మోటార్ల కాపర్ వైర్లు, అలాగే కల్లాల్లో ఆరబోసిన సుమారు 10 క్వింటాళ్ల వడ్లు కూడా చోరీకి గురైనట్లు తేలింది. ఈ దొంగతనాల విలువ సుమారు రూ.62,500గా పోలీసులు అంచనా వేశారు. నిందితుల వివరాలు: కేసు నమోదు చేసి ఎస్సై ఎన్. సుధాకర్ దర్యాప్తు చేపట్టారు. శనివారం పట్టణంలోని చిన్న కెనాల్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన బత్తుల సారవ్వ (37), గంట రాజవ్వ, బత్తుల సమ్మవ్వ, బత్తుల మంజుల, బత్తుల సారవ్వ (27)గా గుర్తించారు. వీరు ప్రస్తుతం జగిత్యాల పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో నివసిస్తూ భిక్షాటన చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో అంగీకరించారు. దొంగిలించిన సొత్తును విక్రయించి వచ్చిన రూ.62,500 నగదును పోలీసులు రికవరీ చేశారు. తక్కువ సమయంలో కేసును ఛేదించిన ఇన్‌స్పెక్టర్ పి.కరుణాకర్, ఎస్సై ఎన్.సుధాకర్ మరియు పోలీస్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ డి.రఘు చందర్ అభినందించారు. #Jagtial #TheftCase #PoliceAction #WomenArrested #AgricultureTheft #CopperWireTheft #PaddyTheft #CrimeNews #TelanganaPolice #LawAndOrder Follow us on Website Facebook Instagram YouTube