BREAKING
అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి ​మహిళా బిల్లులో బీసీలకు సబ్ కోటా కేటాయించాలి
www.ntodaynews.com

గిరిజన తండా గ్రామాలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలి

తెలంగాణ
20 Jun, 2025 - 08:16 PM
195 వీక్షణలు
గిరిజన తండా గ్రామాలు ఆర్థిక అభివృద్ధిని సాధించాలి. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దేబోజిత్ బార . కంచల్ తండాలో పీఎం డిఎ జెజియుఏ గ్రామ సభ. NTODAY NEWS: బొమ్మలరామారం : గిరిజన తండా గ్రామాల ప్రజలు మెరుగైన కుటుంబ ఆర్థిక ప్రణాళిక ద్వారా తండా సమగ్ర అభివృద్ధిని సాధించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దేబోజిత్ బారా అన్నారు. శుక్రవారం మండలంలోని కంచల తండాలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుడు,భగవాన్ బిర్సా ముండా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జన జాతీ గౌరవ టేలో దర్తి ఆభా జన బాగీదారి అభియాన్ , గిరిజన గ్రామాల అభివృద్ధి, ఎస్ ఎస్ టి సి ఎఫ్ ఎల్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన గ్రామ సభలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బ్యాంకులను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆర్థిక ప్రణాళిక ద్వారా పొదుపు చేయడం అలవాటు చేసుకుంటే భవిష్యత్ అవసరాలు తీర్చుకొని, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకోవడం, పొదుపు లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన బ్యాంకు ల్లోనే దాచుకోవాలని, ఆర్థిక క్రమశిక్షణతో క్రెడిట్ స్కోర్ పెంచుకోవాలన్నారు. రుణాలను బ్యాంకుల్లోనే తక్కువ వడ్డీకే పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా, జీవన్ జ్యోతి, సుకన్య సమృద్ధి యోజన పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో గిరిజన గ్రామాలు కీలక పాత్ర పోషించి ఆర్థికంగా ఎదగాలన్నారు. సైబర్ మోసాల ద్వారా ఖాతాదారులు ఎక్కువగా నష్టపోతున్నారని సైబర్ మోసగాళ్ల వలలో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వారు వివరించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండలన్నారు. ప్రతి గిరిజన తండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను సద్వినియోగం చేసుకొని గిరిజన సంక్షేమ దార్శనికత నుండి లక్ష్యాన్ని అధిగమించాలన్నారు. బ్యాంకుల అందించే సేవల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన శాఖ అధికారి భాస్కర్, మండల ప్రత్యేక అధికారి మంజునాథ్ , లీడ్ బ్యాంక్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివరామకృష్ణ, మండల పంచాయతీ అధికారి శ్రీమాలిని, మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, ఎస్ ఎస్ టి సి ఎఫ్ ఎల్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, మండల కోఆర్డినేటర్ ఎల్లబోయిన విశ్వనాథ్, తుర్కపల్లి కోఆర్డినేటర్ నాగరాజ్, కౌన్సిలర్లు ఉమా,భాను , నాయకులు వాలు నాయక్ రమేష్ నాయక్ , అంగన్వాడీ ,ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube