BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 November 2025, 06:04 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి ఘన నివాళి

తెలంగాణ
28 Nov, 2025 - 06:04 AM
168 వీక్షణలు

మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి ఘన నివాళి

NTODAY NEWS: పుంగనూరు భారతదేశ తొలి సామాజిక సమానత్వ ఉద్యమకారుడు, మహిళా విద్యకు ఆధ్యుడు, బహుజన పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా ఆయన మహనీయ సేవలను స్మరిస్తూ- ఓబిసి విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తంబలపల్లి నియోజకవర్గ సురేష్ యాదవ్ హాజరై మాట్లాడుతూ, మహాత్మ జ్యోతిరావు పూలే దేశంలో మహిళలకు విద్యా ద్వారాలు తెరిచిన మహానుభావుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం మహోన్నత పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు అని పేర్కొన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన సేవలు నేటి భారతదేశానికి బాటల్లో ఉన్నాయని అన్నారు. ఇందులో భాగంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ మాట్లాడుతూ —“పూలే లక్ష్యం ఒక్కటే: చదువుకున్న బహుజనులు నాయకులు కావాలి. బహుజనులు చదువు పొందితేనే వారి జీవితం మారుతుంది. హక్కులు, పదవులు, అవకాశాలు ఇవన్నీ విద్యతోనే వస్తాయి. అందుకే పూలే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మా ఓబీసీ సంఘం ఎల్లప్పుడూ విద్యార్థుల అభివృద్ధి కోసం కృషి చేస్తుంది” అని తెలిపారు. అలాగే, సమాజంలో ఇంకా ఉన్న కుల ఆధారిత వివక్షను నిర్మూలించేందుకు యువత పూలే గారి ఆలోచనలను ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. దీనితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న AISF రాష్ట్ర నాయకులు మున్నా మాట్లాడుతూ - ప్రభుత్వాలు మారుతున్నా, పేద, వెనుకబడిన తరగతుల కోసం విద్య లోపాలు ఇంకా పూర్తిగా తొలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పూలే చూపించిన సమానత్వ దిశలో విద్యార్థి ఉద్యమాలు బలంగా సాగాలని, విద్య అందరికీ అందుబాటులో ఉండాలి కానీ కొందరికే కాదు అనే సిద్ధాంతాన్ని అనుసరించాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ BC ఉద్యమ నాయకుడు గంపలు గంగరాజు , బీసీ స్టూడెంట్ నాయకులు సునీల్ యాదవ్, లోకేష్, ప్రభు, రాకేష్,పుంగనూరు ప్రాంతానికి చెందిన విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మహాత్మా పూలే గారి చిత్రపటానికి మాల్యార్పణ చేసి నివాళులు అర్పించారు. Follow us on Website Facebook Instagram YouTube