BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 February 2026, 08:30 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

పుల్వామా అమరులకు గొల్లప్రోలులో నివాళి

తెలంగాణ
14 Feb, 2026 - 08:30 PM
357 వీక్షణలు
పుల్వామా అమరులకు గొల్లప్రోలులో నివాళి; ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటించిన బీజేపీ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి బోర శివారెడ్డి 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందిన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు గొల్లప్రోలులో నివాళులర్పించారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు మాట్లాడుతూ, పుల్వామా దాడి దేశాన్ని కుదిపేసిన ఘటనగా నిలిచిందని పేర్కొన్నారు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై అవంతిపుర సమీపంలోని లేత్‌పుర ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ వాహన దళంపై జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా నిరసనలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించబడినట్లు ఆయన గుర్తుచేశారు. పుల్వామా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఫిబ్రవరి 14ను ‘బ్లాక్ డే’గా పాటిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అమర జవాన్ల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమం ముగిసింది. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. #PulwamaAttack #BlackDay #CRPFMartyrs #Gollaprolu #KakinadaDistrict #TributeToMartyrs #IndiaRemembers Follow us on Website Facebook Instagram YouTube