BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర కుట్రలను అడ్డుకుంటాం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిన్నకాపర్తి
17 Mar, 2026 - 10:28 AM
349 వీక్షణలు

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర కుట్రలను అడ్డుకుంటాం: కాంగ్రెస్ శ్రేణుల ధ్వజం NTODAY NEWS ​చిట్యాల

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) బలహీనపరిచేందుకు కుట్ర పన్నుతోందని, అందులో భాగంగానే పథకం పేరు నుండి 'మహాత్మా గాంధీ' పేరును తొలగించే ప్రయత్నం చేస్తోందని చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపాటి లక్ష్మీనరసింహ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి, బోయగుబ్బ, తాళ్లవెల్లాం గ్రామాల్లో పోస్టర్లను ఆవిష్కరించారు.

​నిధుల తగ్గింపుపై ఆందోళన

​ఈ సందర్భంగా నిర్వహించిన ఉపాధి హామీ కార్మికుల సమావేశంలో లక్ష్మీనరసింహ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. పథకానికి నిధులను తగ్గిస్తూ, గతంలో ఉన్న నిధుల కేటాయింపు పద్ధతిని మార్చి 60 శాతం కేంద్రం – 40 శాతం రాష్ట్రం భరించాలనే నిబంధన తీసుకురావడం పథకాన్ని రద్దు చేసే కుట్రలో భాగమేనని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేట్ జాయింట్ సెక్రటరీ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంత ప్రజల వలసలను నిరోధించి, ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. ప్రస్తుతం వ్యవసాయ అనుబంధ పనులను తొలగించి కూలీల పొట్ట కొట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తన పంథాను మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాంధీ భవన్ బృందం సభ్యులు, బోయగుబ్బ  ఉప సర్పంచ్ బొమ్మగోని లింగస్వామి, వార్డ్ మెంబర్లు మంగమ్మ,  అండాలు, అంతటి రాము, గోపమ్మ, పరమేష్, సీనియర్ నాయకులు రత్నారెడ్డి, ఎట్టయ్య, శేఖర్ 

​చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, ఉపసర్పంచ్ లావణ్య, రఘు, వార్డు మెంబర్లు పల్లపు ప్రశాంత్, దశరథ, చిరంజీవి, గణేష్, వెంకటేశం. తాళ్లబెల్లంల  సర్పంచ్ జోగు సురేష్, సునీత, బుచ్చి రాములు, జనగం నరసింహ గౌడ్, దశరథ, వెంకన్న, నరేష్, మల్లేష్, రమాదేవి, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.