BREAKING
ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి
Date of Publish : 24 July 2026, 08:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఉత్తమ గ్రంథాలయ అధికారిగా అల్లూరు రామచంద్రుడు ఎంపిక

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 08:24 PM
346 వీక్షణలు

పెనుగొలను గ్రామానికి అరుదైన గౌరవం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని నందిగామ శాఖ గ్రంథాలయంలో ద్వితీయ శ్రేణి గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహిస్తున్న గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామానికి చెందిన అల్లూరు రామచంద్రుడు ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ఎంపికయ్యారు.

వేసవి విజ్ఞాన తరగతులను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల్లో పఠనాభిరుచిని పెంపొందించడంలో విశేష కృషి చేసినందుకు ఆయన సేవలను గుర్తించిన కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ ఈ ఏడాది ఉత్తమ గ్రంథాలయ అధికారిగా ప్రకటించింది.

మచిలీపట్నంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అల్లూరు రామచంద్రుడిని శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎంఎస్ బేగ్, కార్యదర్శి వేములపల్లి రవికుమార్, ప్రొఫెసర్ అయ్యంకి వెంకట మురళీకృష్ణతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

పెనుగొలను గ్రామానికి చెందిన అల్లూరు రామచంద్రుడు ఈ గౌరవాన్ని అందుకోవడంతో గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమైంది. శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావుతో పాటు పలువురు ప్రముఖులు, గ్రామస్థులు ఆయనకు అభినందనలు తెలిపారు.