BREAKING
thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య గారి ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు
Date of Publish : 16 June 2026, 06:09 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వాహన్–సారథి సాఫ్ట్‌వేర్ నిలిచిపోవడంతో రవాణా సేవలకు అంతరాయం

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Jun, 2026 - 06:09 AM
99 వీక్షణలు

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా వాహన్ (Vahan), సారథి (Sarathi) సాఫ్ట్‌వేర్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రవాణా శాఖ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహన రిజిస్ట్రేషన్‌లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, యాజమాన్య మార్పిడి వంటి కీలక సేవలు నిలిచిపోవడంతో కార్యాలయాలకు వచ్చిన ప్రజలు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

సాంకేతిక లోపం కారణంగానే వ్యవస్థ నిలిచిపోయిందని రవాణా శాఖ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టాయని, సేవలు పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందని వెల్లడించారు.

సాఫ్ట్‌వేర్ పునరుద్ధరణ అనంతరం అన్ని సేవలు యథావిధిగా అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, కొంత సమయం తర్వాత కార్యాలయాలను సందర్శించాలని సూచించారు.