BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 April 2026, 05:10 pm
Posted by : కూనురు మధు

వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
06 Apr, 2026 - 05:10 PM
297 వీక్షణలు

వైభవంగా శ్రీ బాల వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం

నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో వెలసిన శ్రీ బాల వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు..చిట్యాల పట్టణంలో కొలువైన బాల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు కనులపండువగా నిర్వహించబడ్డాయి. స్వామి వారి కళ్యాణ  కార్యక్రమానికి తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పర్యవేక్షకులుగా వ్యవహరించి కళ్యాణ క్రతువును శాస్త్రోక్తంగా జరిపించారు.​ ఈ కార్యక్రమంలో భాగంగా  ఉదయం బ్రాహ్మీ ముహూర్తం నుంచే ఆలయంలో విశేష పూజలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణార్థం స్వామివారికి శాంతికల్యాణం, ప్రత్యేక హోమాలు నిర్వహించార. కళ్యాణ వేడుక అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.​ఈ వేడుకను వీక్షించేందుకు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని భక్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చారు. గ్రామ పెద్దలు, మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణం మొత్తం గోవింద నామస్మరణతో మారుమోగింది.