BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 02 April 2026, 11:48 am
Posted by : సిర మహేష్

వెల్లంకి లక్ష్మి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
02 Apr, 2026 - 11:48 AM
444 వీక్షణలు

వెల్లంకి లక్ష్మి నగర్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలి – సర్పంచ్‌కు లబ్ధిదారుల వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని ‘లక్ష్మి నగర్’ ప్లాట్ లబ్ధిదారులు తమ కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ వెల్లంకి గ్రామ సర్పంచ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మంజూరు చేసిన ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకుని స్థిరపడాలని తాము ఎంతో ఆశతో ఉన్నామని, కానీ సౌకర్యాలు లేక పనులు ప్రారంభించలేకపోతున్నామని వారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుదీకరణ: ఇళ్ల నిర్మాణానికి, నివాసానికి విద్యుత్ అత్యవసరమని, వెంటనే విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు.

తాగునీరు: 'మిషన్ భగీరథ' పథకం ద్వారా ప్రతి ప్లాట్‌కు తాగునీటి కనెక్షన్ ఇచ్చి నీటి ఎద్దడి తీర్చాలన్నారు.

 డ్రైనేజీ & రోడ్లు: మురుగునీటి పారుదల కోసం శాశ్వత డ్రైనేజీ కాలువలు నిర్మించాలని, రాకపోకలకు వీలుగా అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

 అనుమతులు: విద్యుత్ మీటర్లు, నల్లా కనెక్షన్లు మరియు గృహ నిర్మాణానికి కావలసిన ఇతర సాంకేతిక అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరారు.

పేదలమైన తమ సొంతింటి కల నెరవేరాలంటే ప్రభుత్వం మరియు స్థానిక అధికారులు స్పందించి, యుద్ధ ప్రాతిపదికన లక్ష్మి నగర్ కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని వెల్లంకి గ్రామా సభలో వారు కోరారు . ఈ కార్యక్రమంలో లక్ష్మి నగర్ ప్లాట్ లబ్ధిదారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.


ఇట్లు,

లక్ష్మి నగర్ ప్లాట్ లబ్ధిదారులు,

వెల్లంకి గ్రామం.