BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 06:26 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:26 PM
189 వీక్షణలు

విద్యార్థుల ఏకరూప దుస్తుల తయారీలో నాణ్యత పాటించాలి--జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా అందించే ఏకరూప దుస్తులను పకడ్బందీగా కుట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖాధికారి  కందుల సత్యనారాయణ అన్నారు.ప్రతీ విద్యార్థి కొలతలు తీసుకుని,ఆ కొలతల ప్రకారం దుస్తులు కుట్టాలని శిక్షణ పొందుతున్న స్వయం సహాయక సంఘం మహిళలకు సూచించారు.దుస్తులు కుట్టడానికి వాడే దారం,గుండీలు నాణ్యమైన వాటిని ఉపయోగించాలన్నారు. దుస్తులకు వేసే కుట్లు కూడా దగ్గరగా వేసి,మధ్యలో చినిగిపోకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మహిళలు తమ స్వంత పిల్లలకు దుస్తులు తయారు చేసిన విధంగా భావిస్తూ,నాణ్యమైన వాటిని అందించాలన్నారు.భువనగిరి పట్టణంలో ఉన్న విదిత కుట్టు శిక్షణా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణా కేంద్రాన్ని ఆయన ఈరోజు సందర్శించి,శిక్షణ జరిగే తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి,డి ఆర్ డి ఎ జిల్లా ఏ.పీ.ఎం.పసునూరి రమణ తదితరులు పాల్గొన్నారు.