BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 22 June 2026, 06:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విధి నిర్వహణలోనే డీటీఓ వెంకన్న మృతి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 06:30 PM
146 వీక్షణలు

భూపాలపల్లి, జూన్ 22: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జిల్లా రవాణా అధికారి వెంకన్న (45) మృతి చెందారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని రవాణా శాఖ కార్యాలయం ఎదుట వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు టిప్పర్ లారీ అదుపుతప్పి ఆయనపైకి దూసుకెళ్లింది.

వివరాల ప్రకారం, రవాణా శాఖ సిబ్బందితో కలిసి వెంకన్న తనిఖీలు చేపడుతుండగా పరకాల వైపు నుంచి వచ్చిన టిప్పర్ లారీ ముందుగా రోడ్డుపక్కన ఉన్న హార్వెస్టర్ వాహనాన్ని, అనంతరం డీటీఓ అధికారిక వాహనాన్ని ఢీకొట్టి వెంకన్నను ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు లారీ టైర్లు ఆయనపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ఈ ఘటనతో అక్కడ ఉన్న సిబ్బంది, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంకన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందినవారు. ఇటీవలే జగిత్యాల జిల్లా నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు.

ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రేకులు విఫలమవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వెంకన్న మృతిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించిన మంత్రి, మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.