BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 30 April 2026, 10:14 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరంగల్ కలెక్టర్‌కు విశ్వబ్రాహ్మణ సంఘం వినతి

తెలంగాణ
/ వరంగల్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 10:14 PM
154 వీక్షణలు

వరంగల్ కలెక్టర్‌కు విశ్వబ్రాహ్మణ సంఘం వినతి

వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదను విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు మాటూరి (కురిమిల్ల) రమేష్ నేతృత్వం వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కులాల వారీ జనాభా వివరాల్లో విశ్వబ్రాహ్మణ వృత్తులైన కమ్మర, వడ్రంగి, కంచర, శిల్పకారులు, కంసాలి (అవుసుల)లను వేర్వేరు కులాలుగా చూపించడంపై సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వృత్తులు కులాలు కాకుండా వృత్తులుగా మాత్రమే పరిగణించి, అన్ని వర్గాలను కలిపి విశ్వబ్రాహ్మణులుగా గుర్తించాలని కోరారు.

ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ, కులగణనకు ముందే డెడికేటెడ్ కమిటీకి తమ సంఘాల ద్వారా నివేదికలు, వినతులు సమర్పించినప్పటికీ వాటిని పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. ప్రస్తుతం విడుదలైన కులాల వివరాల్లో తమ వర్గాన్ని విడదీసి చూపించడం వల్ల నష్టాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.

విశ్వబ్రాహ్మణ వృత్తులను కేవలం ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని, కానీ కులాలుగా విభజించకూడదని స్పష్టం చేశారు. గెజిట్ ద్వారా విడివిడిగా చూపించిన జనాభాను ఒకే కులంగా, విశ్వబ్రాహ్మణులుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం తమ వినతిని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పంచకోటి సాంబమూర్తి, కోశాధికారి సింధోజు సుమన్, కమిటీ సభ్యులు గన్నోజు సంజీవ, ఊసాల శ్రీనివాస్, గన్నోజు బాబు చారి తదితరులు పాల్గొన్నారు.