BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 02 August 2026, 09:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వర్షాల కోసం రాజవరం గ్రామంలో నగర సంకీర్తన.. గోమాత ఫోటోలు, హనుమాన్ చాలీసా పుస్తకాల పంపిణీ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 09:24 AM
211 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం రాజవరం గ్రామంలో లోకం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆదివారం భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు.

ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన నగర సంకీర్తనలో భక్తులు "శ్రీరామ.. జయ రామ.. జయ జయ రామ" నామస్మరణ చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం గ్రామ దేవత ముత్యాలమ్మ ఆలయం, బొడ్రాయి, వెంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి లోకకల్యాణం, సకాలంలో వర్షాలు కురవాలని ప్రార్థనలు చేశారు.

తదుపరి గంపలగూడెం దాత కుందా కోటేశ్వరావు అందజేసిన గోమాత ఫోటోలు, హనుమాన్ చాలీసా పుస్తకాలను భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా కమిటీ ఆర్గనైజర్ పారేపల్లి కృష్ణారావు, గ్రామ మాజీ సర్పంచులు అబ్బూరి వెంకటయ్య, చెన్నుపాటి నరసింహారావు, మెట్టగుట్ట దేవస్థానం కమిటీ కార్యదర్శి మన్నె నరసింహమూర్తి, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల యుగంధర్, జిల్లా సమన్వయకర్త అన్నవరపు కాంతికుమార్, సహకార సంఘ మాజీ అధ్యక్షుడు బండారుపల్లి వెంకట నరసయ్య, సాయిబాబా కమిటీ సభ్యులు వై. జగన్నాథం, తొండపు శ్రీను, సుగ్గల ప్రసాద్, మన్నె లక్ష్మణ్‌తో పాటు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.