BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 January 2026, 07:39 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ఘనంగా వసంత పంచమి వేడుకలు

తెలంగాణ
24 Jan, 2026 - 07:39 PM
345 వీక్షణలు
లోత్తునూరు గ్రామంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి: లక్ష్మణ్ గొల్లపల్లి మండలంలోని లోత్తునూరు గ్రామంలో శుక్రవారం వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఆకుల సుమన్ గౌడ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు చిన్నారులు తమ విద్యాభ్యాసాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఆకుల సుమన్ మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తుకు చదువు బలమైన పునాదిగా నిలుస్తుందని, వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయించడం శుభప్రదమని తెలిపారు. చదువుతో పాటు పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై కూడా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పాలు, కోడిగుడ్లు, పండ్లు మరియు పోషక విలువలు గల చిరుధాన్యాలను పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలని కోరారు. సరైన పోషకాహారం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని వివరించారు. పాల్గొన్నవారు: ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ కుమారస్వామి, జయ, ఉపసర్పంచ్ ఓరగంటి మల్లేష్, అంగన్వాడీ టీచర్ డి. స్వప్న, లక్కం మణికంఠ, ఆయా, చిన్నారుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #VasanthaPanchami #Aksharabhyasam #EarlyEducation #Anganwadi #ChildDevelopment #VillageNews #EducationFirst #TelanganaNews #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube