BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 11 April 2026, 06:05 pm
Posted by : సిర మహేష్

వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
11 Apr, 2026 - 06:05 PM
155 వీక్షణలు

రామన్నపేటలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి....

Ntoday News:- యాదాద్రి జిల్లా 

మే 18, 19 తేదీల్లో రామన్నపేటలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జహంగీర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కొండమడుగు నరసింహ పిలుపునిచ్చారు. జిల్లా మహాసభల ఆహ్వాన సన్నాహక సమావేశం స్థానిక కాచం కృష్ణమూర్తి భవన్ లో జల్లెల పెంటయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జహంగీర్, నరసింహ మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యలపై నిరంతరం ఉద్యమిస్తూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందని అన్నారు.


జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల సమస్యలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యచరణకు మహాసభలు తోడ్పడతాయని అన్నారు. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్య చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టిందని అన్నారు. విబిజిరామ్ జి పేరుతో కేంద్రం ఆర్థిక బాధ్యత నుండి తప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం మోపుతుందన్నారు. ఉపాధి కూలీలకు చేసిన పనికి నెలల తరబడి కూలీ డబ్బులు రావడం లేదని అన్నారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతూ పోరాడి సాధించుకున్న ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. రోజు రోజుకు నిత్యవసర ధరలు పెంచుతూ పేదలపై పెను భారం మోపుతుందన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి దొరకక పూట గడవని పరిస్థితిని నెలకొన్నదని అన్నారు. జిల్లాలో వ్యవసాయ కార్మిక సమస్యలపై మహాసభల్లో చర్చించి బలమైన పోరాటాలకు కార్యచరణ చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం మండల వ్యవసాయ కార్మిక సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది మండల అధ్యక్షులుగా మేలు ముకుంద మండల కార్యదర్శిగా కందుల హనుమంతును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి, జిల్లా జిల్లా సహాయ కార్యదర్శి సిర్పంగి స్వామి, రాచకొండ రాములమ్మ,కూరెళ్ళ నర్సింహా చారి,మునిపంపుల సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం, బల్గూరి అంజయ్య, బోయిని ఆనంద్,గన్నబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, కొమ్ము అంజయ్య,పిట్టల పద్మ,శానకొండ వెంకటేశ్వర్లు, నాగటి లక్ష్మణ్,మచ్చ నరేష్, గూని లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.