BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 28 February 2026, 07:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు

తెలంగాణ
28 Feb, 2026 - 07:02 AM
310 వీక్షణలు
సామాన్య భక్తులకు సైతం వీఐపీ సౌకర్యాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ 2027 గోదావరి పుష్కరాలపై జిల్లా స్థాయి సమీక్ష జగిత్యాల, ఫిబ్రవరి 28: 2027 గోదావరి పుష్కరాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ఎలాంటి అసౌకర్యం లేకుండా వీఐపీ స్థాయి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్ రాజా గౌడ్, వివిధ శాఖల అధికారులు, ఈవై కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల రద్దీపై అంచనాలు 2015 పుష్కరాల్లో జగిత్యాల జిల్లాలో సుమారు కోటి 50 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించగా, 2027 నాటికి ఈ సంఖ్య 4 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ. 940 కోట్ల ప్రణాళిక జిల్లాలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రూ. 940 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రితో త్వరలో చర్చిస్తామని మంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలపై దృష్టి పారిశుద్ధ్యం, పార్కింగ్, తాగునీరు, వైద్యసేవలు, భద్రతా చర్యలు పుష్కరాల సమయంలో సమర్థవంతంగా ఉండాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. గోదావరి తీరంలోని ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అధికారులపై ఆగ్రహం సమీక్షా సమావేశానికి హాజరుకాని అధికారులపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పది రోజుల్లో మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని, పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. #GodavariPushkaralu #Jagtial #AdluriLakshmanKumar #TelanganaNews #Pushkaralu2027 #PublicInfrastructure Follow us on Website Facebook Instagram YouTube