BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

గ్రామ అభివృద్ధి కోసం ఓటేయండి

తెలంగాణ
04 Dec, 2025 - 07:15 PM
264 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించండి, గ్రామ అభివృద్ధి కోసం ఓటేయండి

-- ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య NTODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం,గ్రామాల్లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం మండలంలోని మేడిపల్లి, మైలారం, నాగినేనిపల్లి, మైలారం, తిరుమలగిరి, హాజీపూర్, మసిరెడ్డిపల్లి, పెద్ద పర్వతాపూర్, రంగాపురం, తూముకుంట, యావపూర్, కేకే తండా,చౌదర్ పల్లి, మర్యాల,మాచన్ పల్లి, బొమ్మలరామారం గ్రామాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న ప్రతీ కార్యకర్త ప్రజల సంక్షేమం కోసం, గ్రామాభివృద్ధి కోసమే పనిచేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధిలో దూసుకెళ్తాయన్నారు. నిస్వార్థంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేసే వారినే కాంగ్రెస్ బలపరిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలతో రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ, వడ్డీలేని రుణాలు,ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, భువనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్,మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత నాయక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి,గంగాదేవి హనుమంతు, మండల నాయకులు, పాటు పలు పంచాయతీల అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube