BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 October 2025, 03:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మొంథాను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం

తెలంగాణ
28 Oct, 2025 - 03:48 AM
204 వీక్షణలు
మొంథాను ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నాం NTODAY NEWS: గోపాలపురం నియోజకవర్గం రిపోర్టర్ 10 వేలమందికి ఆహారం సిద్ధం చేశాం మంత్రి లోకేష్‌తో ఫోన్లో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంటకరాజు నియోజకవర్గంలోని పరిస్థితిని తెలుసుకునేందుకు ఆర్టీజీఎస్ నుంచి ఎమ్మెల్యేకు లోకేష్ ఫోన్ ఎర్రకాలువతో రైతులు పడుతున్న ఇబ్బందిని మంత్రి లోకేష్‌కు వివరించిన ఎమ్మెల్యే మద్దిపాటి నల్లజర్ల : మొంథా తుఫాన్ నేపథ్యంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగంతో కలిసి సిద్ధంగా ఉన్నామని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంటకరాజు అన్నారు. రైతులతో కలిసి ఎర్రకాలువ గట్లను పరిశీలిస్తున్న సమయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి తుఫాన్ ప్రభావాన్ని పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్యే మద్దిపాటికి ఫోన్ చేశారు. నియోజకవర్గంలో తుఫాను ప్రభావిత కారణంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితిని గురించి ఆరా తీశారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలను మద్దిపాటి వివరించారు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నచోట నుంచి పునరావాస కేంద్రాలకు తరలించాలని మంత్రి లోకేష్ సూచించగా...పునరావాసాలకు తరలించడంతో పాటు 10 వేల మంది ఆహారాన్ని, తాగునీటిని కూడా సిద్ధం చేసి ఉంచామని మద్దిపాటి వివరించారు. పొలాలు ముంపుబారిన పడకుండా డ్రెయిన్లు క్లియర్ చేసే అంశంపైనా దృష్టిపెట్టాలని మంత్రి లోకేష్ అన్నారు. రైతులతో కలిసి ట్రాక్టర్‌లో పంటలను పరిశీలించామని, కాల్వలకు గండ్లు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని మద్దిపాటి వివరించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వెంటకరాజుకు మంత్రి లోకేష్ సూచించారు. అంతకముందు ఎమ్మెల్యే వెంటకరాజు నల్లజర్ల మండలం గుండెపల్లి గ్రామంలో ఎర్ర కాలువ ఉధృతిని స్థానిక రైతులులతో కలిసి పరిశీలించారు. పలు గ్రామాల్లో ట్రాక్టర్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వెంటకరాజు అడిగి తెలుసుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube