BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 08 August 2025, 06:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలేంటి?

తెలంగాణ
08 Aug, 2025 - 06:53 AM
293 వీక్షణలు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం తీసుకున్న చర్యలేంటి? NTODAY NEWS: ఢిల్లీ/ఏలూరు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం. దిల్లీ/ఏలూరు ‎గత మూడేళ్లలో CRIF కింద ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన రహదారుల ప్రాజెక్టులపై సమాచారం, పురోగతిలో ఉన్న రోడ్ల వివరాలు, వాటి పొడవు, ఖర్చు కోరుతూ ఏలూరు ఎంపీ శ్రీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన ప్రశ్నకు లోక్ సభలో కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. సిఆర్ఐఎఫ్ పథకం కింద కేంద్రం విడుదల చేస్తున్న నిధుల వివరాలు. ప్రస్తుత సంవత్సరంతో సహా గత మూడేళ్ళలో రూ: 535 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్ లో 691 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన 20 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు పూర్తయ్యాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఏపీలో ప్రస్తుతం రూ: 1,256 కోట్ల వ్యయంతో 534 కిలోమీటర్ల పొడవు గల 55 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులు CRIF కింద నిర్మాణంలో ఉన్నాయని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు. అంతేకాకుండా రూ: 1,928 కోట్ల వ్యయంతో 718 కిలోమీటర్ల పొడవైన మరో 57 రాష్ట్ర రహదారి ప్రాజెక్టులను కూడా కేంద్రం ఆమోదించిందని కేంద్ర మంత్రి తెలిపారు. "సిఆర్ఐఎఫ్ చట్టం-2000" నిబంధనలు ప్రకారం కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తగిన నిధులు కేటాయిస్తుందని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. Follow us on Website Facebook Instagram YouTube