BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 11 March 2026, 07:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

తెలంగాణ ఉద్యమ నాయకుడు అడుగు ఎటు వైపు?

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Mar, 2026 - 07:46 AM
242 వీక్షణలు
తెలంగాణ ఉద్యమ నాయకుడు సంజయ్ దాస్ గౌడ్ అడుగు ఎటు వైపు? NTODAY NEWS : చిట్యాల తెలంగాణ ఉద్యమ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ ఉగాది తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఆయన, తదుపరి రాజకీయంగా ఏ దిశగా అడుగులు వేస్తారన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉగాది అనంతరం శుభ ముహూర్తంలో తన అనుచరులు, మిత్రులతో సమావేశమై భవిష్యత్ రాజకీయ ప్రస్థానంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన బీఆర్‌ఎస్ వైపు వెళ్తారా, తెలంగాణ జాగృతి సంస్థలో కీలక పాత్ర పోషిస్తారా, లేక అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతారా అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఉద్యమ కాలం నుంచే సంజయ్ దాస్ గౌడ్ బీఆర్‌ఎస్ పార్టీతో పాటు తెలంగాణ జాగృతిలో కీలకంగా పనిచేశారు. మాజీ మంత్రులు కేటీఆర్, గుంతకండ్ల జగదీష్ రెడ్డితో పాటు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఆయన సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన చేరికపై ఆయా నేతలతో సంప్రదింపులు జరిగాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక మరోవైపు, ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సంజయ్ దాస్ గౌడ్ ఆయనకు సన్నిహితంగా పనిచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. ప్రజా పోరాటాలు, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించిన సంజయ్ దాస్ గౌడ్ తీసుకునే నిర్ణయం ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల ఆశయాలు మరియు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని తాను నిర్ణయం తీసుకుంటానని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. #SanjayDasGoud #TelanganaPolitics #BRS #Congress #TelanganaJagruthi #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube