BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 24 March 2026, 02:05 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

యుద్ధ ప్రభావం: భగ్గుమంటున్నా వంట నూనెల ధరలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 02:05 PM
182 వీక్షణలు

యుద్ధ ప్రభావం: వంట నూనెల ధరలు భగ్గుమంటున్నాయి

న్యూఢిల్లీ, మార్చి 24: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో దేశవ్యాప్తంగా వంట నూనెల ధరలు గణనీయంగా పెరిగాయి. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో పెరుగుదల కనిపించగా, మార్చి నెలలో ధరలు మరింత ఎగబాకాయి.

మార్కెట్‌లో ప్రస్తుతం లీటర్ పామోలిన్ నూనె ధర రూ.145కు చేరుకోగా, సన్‌ఫ్లవర్ నూనె రూ.175 వద్ద విక్రయమవుతోంది. బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్నాయి.

వివరాల ప్రకారం, సన్‌ఫ్లవర్ నూనెపై రూ.21, పామోలిన్‌పై రూ.12, వేరుశనగ నూనెపై రూ.16 చొప్పున పెరుగుదల నమోదైంది. దిగుమతులపై ఆధారపడే భారతదేశానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడిన అనిశ్చితి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

వాణిజ్య వర్గాల అంచనా ప్రకారం, సమీప భవిష్యత్తులో కూడా వంట నూనెల ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ధరల పెరుగుదల సాధారణ ప్రజలపై ఆర్థిక భారం మోపుతోంది.