BREAKING
రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా. రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం....... విజిల్ తో వీధుల్లోకి.. పారిశుద్ధపై పక్కానిగా.
Date of Publish : 25 July 2026, 05:10 pm
Posted by : V శ్రీనివాస్

​యువత ఐక్యత ముందర తలవంచిన కేంద్రం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హర్షం

జాతీయం జాతీయం
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Jul, 2026 - 05:10 PM
111 వీక్షణలు

​యువత ఐక్యత ముందర తలవంచిన కేంద్రం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హర్షం

​గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత సాగించిన ఉక్కుపాదం లాంటి సుదీర్ఘ పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. విద్యార్థుల ఆగ్రహ జ్వాలలకు లొంగి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంపై పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ ఘాటుగా స్పందించారు. ఈ విజయాన్ని భారతదేశ యువత సాధించిన చారిత్రాత్మక విజయంగా ఆయన అభివర్ణించారు.

​"ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా కాదు... తమ హక్కుల కోసం దేశమంతా ఒక్కటై పోరాడిన భారతీయ యువత సాధించిన అపారమైన విజయం! యువకులు ఒక లక్ష్యం కోసం కంకణం కట్టుకుని రోడ్డెక్కితే ఎంతటి ప్రభుత్వమైనా దిగిరావాల్సిందేనని ఈరోజు నిరూపితమైంది," అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు.

​అధికార బీజేపీ అహంకార వైఖరికి ఈ రాజీనామా చెంపపెట్టు లాంటిదని విమర్శించిన ఎంపీ, ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. విద్యార్థుల భవిష్యత్తుతో, హక్కులతో మళ్ళీ ఆడుకోవాలని చూస్తే న్యాయం కోసం యువతతో కలిసి మరోసారి రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ, దేశ యువతకు అభినందనలు తెలిపారు