BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 06 February 2026, 11:24 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వైఎస్ షర్మిల భేషరతు క్షమాపణ చెప్పాలి

తెలంగాణ
06 Feb, 2026 - 11:24 AM
332 వీక్షణలు
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల భేషరతు క్షమాపణ చెప్పాలి పుంగనూరులో బీజేపీ నాయకుల నిరసన, పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు డిమాండ్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు  కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుంగనూరులో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రధాని నరేంద్ర మోదీని గౌరవిస్తూ భేషరతుగా క్షమాపణ చెప్పాలని పుంగనూరు పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎం. జగదీష్ రాజు డిమాండ్ చేశారు. శనివారం పుంగనూరు పట్టణంలోని ట్రావెలర్స్ బంగ్లాలో బీజేపీ నాయకులు సమావేశమై షర్మిల వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగదీష్ రాజు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకానికి పేరు మాత్రమే మారిందని చెప్పడం అవగాహనలేని వ్యాఖ్య అని అన్నారు. పథకం అమలులో పేదలకు ఎలాంటి నష్టం జరగలేదని, ఎప్పటిలాగే ఉపాధి హామీ ద్వారా లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉనికి లేకపోవడంతోనే షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు చేసి పార్టీని మళ్లీ గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశాన్ని 70 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ సాధించలేని అభివృద్ధిని, గత పదేళ్ల బీజేపీ పాలనలో సాధించిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ స్థాయిలో శక్తివంతమైన దేశంగా అవతరించిందని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని తెలుసుకోకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని షర్మిలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే భేషరతుగా క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు మల్లికా రాణి, జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యుడు పెద్దమటం బాబు, సీనియర్ నాయకులు అరవపల్లి వెంకటరెడ్డి, టీవీఎస్ ప్రసాద్, ఉమా శంకర్, డాక్టర్ జగన్నాథం, విజయశంకర్, విజయభాస్కర్ రెడ్డి, దిలీప్, చిట్టెమ్మ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. #BJP #Punganur #NarendraModi #YSSharmila #PoliticalNews #AndhraPradesh #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube