BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 01:16 pm
Posted by : V శ్రీనివాస్

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
17 Mar, 2026 - 01:16 PM
299 వీక్షణలు

విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ

మంచిర్యాల జిల్లా నస్పూర్ లోని కేజీబీవీ (KGBV) పాఠశాల మరియు కళాశాల విద్యార్థులకు మంగళవారం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పుట్ట యశోద మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్. అనిత హాజరై, తమ చేతుల మీదుగా 56 మంది విద్యార్థులకు అద్దాలను అందజేశారు.

ఇటీవల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన కంటి పరీక్షల్లో భాగంగా, దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించిన 56 మందిని ఎంపిక చేసి ప్రభుత్వం ఈ అద్దాలను సరఫరా చేసింది.

అధికారుల సూచనలు:

ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాట్లాడుతూ.. విద్యార్థులు కంటి అద్దాలను క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. కంటి సంబంధిత వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దూరదృష్టి లోపంతో బాధపడేవారు పౌష్టికాహారం తీసుకోవాలని తెలిపారు. విటమిన్ 'ఏ' అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు ఆహారంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, తహసీల్దార్, వైద్యులు, వైద్య సిబ్బంది, జిల్లా నోడల్ అధికారి, మాస్ మీడియా అధికారి, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.