BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 March 2026, 07:48 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న లే అవుట్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
24 Mar, 2026 - 07:48 PM
277 వీక్షణలు

ఆర్ అండ్ ఆర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న లే అవుట్ ను పరిశీలించిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్  జయంతి

భువనగిరి మండల పరిధిలోని బస్వాపూర్ రిజర్వాయర్‌కు సంబంధించి పునరావాసం మరియు పునర్వ్యవస్థీకరణ (ఆర్ అండ్ ఆర్) ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న బి.ఎన్. తిమ్మాపురం, లప్పానాయక్ తండా లే అవుట్‌లను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి, భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి తో కలసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ లే అవుట్‌లో కొనసాగుతున్న మరియు పెండింగ్‌లో ఉన్న మౌలిక వసతుల పనులను పరిశీలించారు . ఇప్పటి వరకు చేపట్టిన పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, ఇంకా ప్రారంభించాల్సిన పనులను తక్షణమే మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను కోరారు . నివసించే ప్రజలకు అవసరమైన రహదారులు, విద్యుత్, తాగునీరు వంటి సౌకర్యాలను త్వరితగతిన అందించాలన్నారు.ప్రభుత్వ భవనాల నిర్మాణంపై కూడా  ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు, వాటి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవు తుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కాలనీలోకి వెళ్లే మట్టి రహదారులను చదును చేసి,  రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చుడాలన్నారు ఈ కార్యక్రమంలో భువనగిరి మండలం తహసీల్దార్ జగన్మోహన్ ప్రసాద్‌తో పాటు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.