BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 14 June 2026, 08:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆర్థిక లావాదేవీలకు పాన్ తప్పనిసరి – కేంద్రం కొత్త నిబంధనలు అమలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 08:47 PM
139 వీక్షణలు

ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాన్ (Permanent Account Number) కార్డును తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది.

కొత్త మార్గదర్శకాల ప్రకారం

రూ.20 లక్షలకు పైగా విలువైన ఆస్తుల కొనుగోలు, అమ్మకాలకు పాన్ తప్పనిసరి చేయబడింది. అలాగే రూ.2 లక్షలకు మించిన విలువైన వస్తువులు లేదా సేవల కొనుగోలు, రూ.1 లక్షకు పైగా షేర్ల కొనుగోలు, అమ్మకాలకు కూడా పాన్ అవసరం అని స్పష్టం చేసింది.

అదేవిధంగా కారు, బైక్ వంటి వాహనాల కొనుగోలు రూ.5 లక్షలకు మించి ఉంటే పాన్ తప్పనిసరి. డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలన్నా పాన్ వివరాలు సమర్పించాల్సిందే.

పాన్ వివరాలు ఇవ్వకపోతే సంబంధిత ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయే అవకాశం ఉంది. తప్పుడు వివరాలు సమర్పించినట్లయితే రూ.10 వేల వరకు జరిమానాతో పాటు ఆదాయపు పన్ను శాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరించారు.