BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు వక్ఫ్ బోర్డునే రద్దు చేయండి

తెలంగాణ
21 Apr, 2025 - 07:29 AM
81 వీక్షణలు
వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు వక్ఫ్ బోర్డునే రద్దు చేయండి కేంద్ర ప్రభుత్వానికి ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా సూచన విజయవాడ వక్ఫ్ బోర్డు చట్టాన్ని కాదు వక్ఫ్ బోర్డు నే రద్దు చేయాలని, పేద ముస్లిం సమాజానికి ఉపయోగపడని వక్ఫ్ బోర్డు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు ముస్లిం పర్సనల్ లా బోర్డు బోర్డ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అల్తాఫ్ రజా.వందల సంవత్సరాల నుండి మా పూర్వికులకు సంబంధించిన భూములను 1958లో బలవంతంగా సర్వే చేసి 1962 గజిట్లో చేర్చి అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుడు నిర్ణయాలతో మా భూములు రక్షిస్తామని మాయమాటలు చెప్పి దశలవారీగా చట్ట సవరణలు మాఫియాలకు అక్రమ దారులకు అనుకూలంగా ఉండే విధంగా చట్ట సవరణలు చేయటం వలన ముస్లిం సమాజం చాలా విధాలుగా నష్టపోయింది.రోజు రోజుకి పేదరికంతో ఇబ్బంది పడుతున్న ముస్లిం సమాజం.....పేద ముస్లిం మైనార్టీలకు ఏమాత్రం లాభం చేయని వక్ఫ్ వ్యవస్థ రద్దు ఎందుకు చేయకూడదు? అని అల్తాఫ్ రజా ప్రశ్నించారు. వక్ఫ్ బోర్డు పేద ముస్లిం ఆడపిల్లలకు పెళ్లిళ్ల కోసం కానీ పేద ముస్లింల చదువుల కోసం కానీ వారి సంక్షేమానికి ఉపయోగపడనప్పుడు అలాంటి వర్క్ బోర్డు వ్యవస్థ అవసరమా? అన్నారు.వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి. ఎనామస్ బాడీ... సూపర్ రేసింగ్ అథారిటీ.. రాజకీయంతో ఎటువంటి సంబంధం లేని ముతవల్లీలు. న్యాయవాదులు మత గురువులు ప్రజలచే ఎన్నుకోబడిన ముస్లిం మైనార్టీ పార్లమెంట్ శాసన సభ్యులు కానీ మండలి సభ్యులు కానీ లేక మాజీలు గాని పార్టీలకు అతీతంగా ఎన్నుకోబడిన వ్యక్తుల మరియు ఐఏఎస్ ఐపీఎస్ మైనార్టీ వ్యక్తులు కమిటీ... ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తుల రక్షణ కొరకు నిర్ణయాలు తీసుకొటకు ఆక్రమణదారుల పై చర్యలు తీసుకొనుటకు మాత్రమే వక్ఫ్ బోర్డు వ్యవస్థను తీసుకురావడం జరిగిందని తెలిపారు. అలాంటి వ్యవస్థను రాజకీయ వ్యవస్థగా మార్చి రాజకీయ తొత్తులుగా అధికారులు కమిటీ వారు కలిసి వక్ఫ్ ఆస్తి అంటే పూర్తిగా హక్కుదారులు మేమే అన్నట్టు తప్పుడు వ్యవహారాలతో ఆక్రమణదారులకు మాఫియాలకు తొత్తులుగా మార్చడం వలన ముస్లిం మైనార్టీలకు ఎంతగానో నష్టం కలిగించి..వక్ఫ్ బోర్డు రాజకీయ నాయకుల తొత్తులుగా మారటమే కాకుండా మసీదులు దర్గాల కమిటీల వ్యవహారాల్లో కూడా రాజకీయ నాయకుల పెత్తనం చేరడంతో వ్యవస్థ పూర్తిగా నాశనానికి కారణమైంది...మైనార్టీలకు సంబంధించిన భూములను రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చుకొని కంపెనీలకు ప్రభుత్వ అవసరాలకు మైనార్టీ ఆస్తులే అతి తక్కువ ధరకు ఎక్వేర్ చేసుకుని మతవల్లిల అనుమతి లేకుండా వక్ఫ్ బోర్డు అధికారులు రాజకీయ జోక్యంతో ప్రభుత్వ అధికారులు చట్టాలను తన అనుకూలంగా మార్చుకొని కనీసం ఆ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించకుండా ముస్లిం మైనార్టీల వ్యవస్థను నాశనం చేశారు...వందల సంవత్సరాల నుండి వంశపారపరంగా వస్తున్న ముత్తవల్లిలను దొంగలుగా చిత్రీకరించి వక్ఫ్ బోర్డు అధికారులు పెత్తందారులుగా మారారు... స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వాలు మారిన మైనార్టీ ఆస్తులకు రక్షణ కరువైంది . వందల సంవత్సరాలుగా రాజులు దానం చేసిన మైనార్టీ భూములపై రక్షణ కల్పిస్తామని నమ్మబలికి నవాబులుగా జమీందారులుగా ఉన్న ముస్లింలను కుట్రపూరితంగా సకీర్లుగా మార్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇది వాస్తవం కాదా? చట్ట సవరణలు ఎన్నిసార్లు చేసినా మైనార్టీ ఆస్తులు ఆక్రమించిన ఆక్రమణదారులపై ఎటువంటి చర్యలైన తీసుకున్నట్టు దాఖలాలు ఉన్నాయా? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయండి మా ఆస్తులు మాకు అప్పగించి మాకు పూర్తి హక్కు కల్పించండి . మా భూముల్లో మేమే పరిశ్రమలు పెట్టుకుంటాం పేద ముస్లింల సంక్షేమానికి దోహదపడే విధంగా చర్యలు తీసుకుంటాం....అని అల్తాఫ్ రజా తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube