BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 April 2026, 04:12 pm
Posted by : V శ్రీనివాస్

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు

తెలంగాణ
/ మంచిర్యాల / లక్సెట్టిపేట
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
14 Apr, 2026 - 04:12 PM
139 వీక్షణలు

అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని మరువద్దు: మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి

​భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, ఆయన పోరాట స్ఫూర్తిని ఎన్నటికీ మరువద్దని లక్షెట్టిపేట మున్సిపల్ చైర్‌పర్సన్ దొంత అంజలి-నర్సయ్య పిలుపునిచ్చారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే నేడు దేశంలో ప్రజాస్వామ్యం భద్రంగా ఉందన్నారు. నవ భారత నిర్మాతగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యమని కొనియాడారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి పంచశీల జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు అవునూరి లచ్చన్న, జిల్లా నాయకులు శనిగారపు లింగన్న, మండల అధ్యక్షులు రాందాస్, కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ మరియు అధిక సంఖ్యలో అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు