BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 23 April 2026, 05:00 pm
Posted by : సిర మహేష్

అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
సిర మహేష్ రామన్నపేట మండల ప్రతినిధి
23 Apr, 2026 - 05:00 PM
127 వీక్షణలు

మునిపంపుల అంగన్ వాడి క్లస్టర్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ దివాస్ 

గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం 

యాదాద్రి జిల్లా :- పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందిస్తేనే శక్తివంతంగా తయారవుతారని, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. మునిపంపుల అంగన్వాడి సెక్టార్ పరిధిలో పోషణ పక్వాడ దివాస్ సందర్భంగా పిల్లలు, గర్భిణీలు బాలింతలకు ఐసిడిఎస్, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ పోషకాహారం అంటే ఖరీదైన ఆహారం కాదు అని మన గ్రామాల్లో లభించే పప్పులు Zకూరగాయలు, పండ్లు, పాలు, ఆకు కూరలు వంటి పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించొద్దని గ్రామంలో ప్రజలందరూ పరిశుభ్రత పాటించాలని అన్నారు. అంగన్వాడి టీచర్లు స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్, పంచాయతీ కార్యదర్శి రచ్చ వేణు గ్రామ ఉపసర్పంచ్ తాళ్ల క్రాంతి కుమార్, అంగన్వాడీ టీచర్లు బద్రుని సాబేగం,బాదె మంజుల, యాదాసు శోభ, ఏలూరు అనిత, ఆశా వర్కర్లు మామిండ్ల లక్ష్మి, గాదె అలివేలు, ఏఎన్ఎం కార్యకర్తలు, మునిపంపుల సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్లు, పిల్లలు, బాలింతలు,గర్భిణీ స్త్రీలు,, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.