BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 29 May 2026, 07:57 pm
Posted by : V శ్రీనివాస్

​అంగన్‌వాడీ టీచర్లకు ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్పై అవగాహన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
29 May, 2026 - 07:57 PM
293 వీక్షణలు

పోషకాహార లోప నిర్మూలనకు కృషి చేయాలి: జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ‘ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్’ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మంచిర్యాల ప్రాజెక్టు అంగన్‌వాడీ టీచర్ల కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నారుల సమగ్ర అభివృద్ధిలో ఎర్లీ చైల్డ్‌హుడ్ డెవలప్‌మెంట్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ముఖ్యంగా శిశువు జీవితంలోని మొదటి 1000 రోజుల కాలం వారి శారీరక, మానసిక, మరియు మేధో వికాసానికి అత్యంత కీలకమని స్పష్టం చేశారు. పిల్లల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించి, వారి సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

​ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా తల్లి సంరక్షణ, సరైన పోషకాహారం, చిన్నారుల ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఒక భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన గోడప్రతులను (పోస్టర్లను) జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ ఆవిష్కరించి, వాటిని అంగన్‌వాడీ కేంద్రాలలో ప్రదర్శించేందుకు టీచర్లకు అందజేశారు. క్షేత్రస్థాయిలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ టీచర్లు, సూపర్ వైజర్లు మరియు సంక్షేమ శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు