BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 03 July 2026, 06:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అనకాపల్లి జిల్లాలో దారుణం.. భార్య, ప్రియుడి పక్కా ప్రణాళికతో భర్త హత్య?

ఆంధ్రప్రదేశ్
/ అనకాపల్లి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jul, 2026 - 06:23 AM
149 వీక్షణలు

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం శ్రీరాంపురం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దారపురెడ్డి అప్పలనాయుడు (38) అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది.

అప్పలనాయుడికి సుమారు 11 ఏళ్ల క్రితం ఎస్.కోట మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన హైమతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు అనూష, యోక్షిత ఉన్నారు. హైమ ప్రస్తుతం శ్రీరాంపురం గ్రామంలో వెలుగు వీఓఏగా పనిచేస్తోంది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, హైమకు కె.కోటపాడు మండలం జోగన్నపాలెంకు చెందిన బండారు గంగాధర్‌తో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు హైమను విచారిస్తున్నారు.

బుధవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అప్పలనాయుడిని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ప్రియుడి ప్రణాళిక మేరకే ఈ హత్య జరిగిందా? మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటన అనంతరం బండారు సత్యనారాయణ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

సంఘటన స్థలాన్ని కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, ఎస్ఐ వి.సత్యనారాయణ, క్లూస్ టీం ఇన్స్పెక్టర్ విజయ, ఎస్ఐ లక్ష్మీనరసింహ పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కె.కోటపాడు సీహెచ్‌సీకి తరలించారు.

మృతుడి అన్నయ్య దారపురెడ్డి ఎర్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.