BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
07 Apr, 2026 - 07:22 PM
154 వీక్షణలు

అన్నదాతకు అండగా తెలంగాణ సర్కార్ ; ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గంలోని రైతులు తాము పండించిన ప్రతి గింజను అమ్ముకునేలా ప్రభుత్వం పక్కా చర్యలు తీసుకుంటోందని, అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. మంగళవారం చిట్యాల పట్టణంతో పాటు  వట్టిమర్తి, వనిపాకల, ఆరెగూడెం, పెద్దకాపర్తి, వెలిమినేడు, సుంకెనపల్లి, గుండ్రంపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన కొబ్బరికాయ కొట్టి, రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రైతు కుటుంబం నుండి వచ్చిన వారు కావడం వల్ల సాగు కష్టాలు ఆయనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేసినప్పటికీ, రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చాలని  పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని కొనియాడారు. అంతేకాకుండా రైతులకు ధాన్యానికి బోనస్ అందించడంతో పాటు, రుణమాఫీ,రైతు భరోసా,  వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని అన్నారు.  మద్దతు ధర విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రైతులు తొందరపడి తక్కువ ధరకు దళారులకు ధాన్యం అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలనే ఆశ్రయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీతా రమేష్, ఏఎంసీ చైర్మన్ నర్ర వినోద మోహన్ రెడ్డి, సర్పంచులు కాటం వెంకటేశం, ఆవుల సునీత యాదయ్య, ఆవుల సుందర్, బొంతల చంద్రారెడ్డిలతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, వివిధ విభాగాల ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.