BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆదర్శ రైతు సంఘ వార్షిక మహాసభ సమావేశం.

తెలంగాణ
27 Nov, 2025 - 08:41 AM
151 వీక్షణలు

ఆదర్శ రైతు సంఘ వార్షిక మహాసభ సమావేశం.

: నూతన పాలకవర్గం ఎంపిక.

NTODAY NEWS: ఆమడగూరు మండల రిపోర్టర్ రామాంజనేయులు  ఆమడగూరు మండలంలోని స్థానిక చౌడేశ్వరి కళ్యాణ మండపం నందు ఆదర్శ రైతు సంఘ సమావేశం మహాసభను ఆదర్శ రైతు సంఘం మండల అధ్యక్షులు సాంకేతిక సహాయకులు, వాసన సంస్థ వారిచే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆదర్శ రైతు సంఘం వార్షిక మహాసభ ఇది మూడవ మహాసభగా వార్షిక మహాసభ జరుగుతుందని గత పాలక వర్గ సభ్యులు వనజమ్మ తెలియజేయడం జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలొ జరిగినటువంటి లావాదేవీలను కార్యకలాపాలను వార్షిక నివేదిక ద్వారా చదివి వినిపించడం జరిగింది ఈ సమావేశంలో వాసన్ సంస్థ ప్రోగ్రాం ఆఫీసర్ ఉత్తప్ప మాట్లాడుతూ ఆదర్శ రైతు సంఘం అనేది రైతుల కోసం ఏర్పాటు అయినదని ఈ రైతు సంఘం రైతులకు సేవ చేయడం కోసమే ఏర్పాటు అయిందని ఈ రైతు సంఘాన్ని మీరే ముందుండి నడపాలని పాలకవర్గ సభ్యులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆదర్శ రైతు సంఘం ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరివర్తన ప్రోగ్రామ్ ద్వారా రైతులకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతుందన్నారు ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరగాయల సాగు దేశీ విత్తనాలు వ్యవసాయ సులభతర కేంద్రాలు చిరుధాన్యాల ద్వారా తినుబండారాలు మార్కెటింగ్ మొదలుకొనీ అనేక కార్యక్రమాలకు హెచ్డిఎఫ్సి బ్యాంకు వారు సీఎస్సార్ ఫండ్ ద్వారా రైతులకు ఆర్థిక సపోర్ట్ చేస్తున్నారని తెలియజేయడం జరిగింది అదేవిధంగా రైతు సంఘం ప్రతి సంవత్సరం ఒకసారి వార్షిక మహాసభను నిర్వహించి గత సంవత్సరంలో జరిగినటువంటి కార్యకలాపాలను వార్షిక నివేదిక ద్వారా రైతు సంఘ సభ్యులకు వాటాదారులకు తెలియజేస్తుందని అదేవిధంగా ఈ సంవత్సరము కూడా జరిగినటువంటి కార్యక్రమాలను వార్షిక నివేదిక ద్వారా చదివి వినిపించడం జరిగిందని తెలియజేశారు రాబోయే ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే కార్యక్రమాలను చదివి వినిపించడం జరిగింది. ఈ సమావేశంలో పాత పాలకవర్గాన్ని బైలా ప్రకారం తొలగించి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని తెలియజేశారు రైతులు, రైతు సంఘం ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల అవలంబించి కషాయాలు, దిబ్బ, ఎరువులు మొదలుగు వంటివి వేసుకొని పంటలు పండించి ఆరోగ్యకమైన జీవనాన్ని కొనసాగించాలని చిరుధాన్యాల పండించి వాడకం అలవాటు చేసుకోవాలని తెలియజేయడం జరిగింది దేశీయ విత్తనాలను ఉత్పత్తి చేసే క్రమంలో పండించి వాటిని భద్రపరుచుకోవాలని తెలియజేయడం జరిగింది. పాత రకాలైనటువంటి తీగ సేనక్కాయ చినగుత్తి కాయ తెలహంస వరి అనేక రకాలైనటువంటి నాటి విత్తనాలు కనుమరుగైనాయని వాటిని మళ్లీ తిరిగి ఉత్పత్తి చేస్తే వాటి ద్వారా పంటలు పండించుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవచ్చునని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై దృష్టి పెట్టి రసాయనిక మందులు ద్వారా పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి జబ్బులకు గురవుతున్నారని తెలియజేయడం జరిగింది వీటన్నింటికీ ముఖ్య కారణం సమస్యలు తీరాలంటే ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని మన భూమి తల్లిని కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని పంటల ద్వారా ఆహారం ద్వారా మన శరీరాన్ని కాపాడుకోవచ్చునని తెలియజేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో వాసన్ సంస్థ ప్రోగ్రాం ఆఫీసర్ ఉత్తప్ప వెలుగు ఏపిఎం భారతి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుమేనేజర్ వాసన సమస్త సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube