BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 30 December 2025, 10:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కట్టుదిట్టమైన పోలీస్ నాకాబందీ

తెలంగాణ
30 Dec, 2025 - 10:12 AM
350 వీక్షణలు

శాంతిభద్రతలలో భాగంగా గోదావరిఖని పరిధిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబందీ

NTODAY NEWS: గోదావరిఖని  అక్రమాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు చెక్… ప్రజా రక్షణే లక్ష్యం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలకు డీజేలకు అనుమతి లేదు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ బి. రామ్ రెడ్డి ఉత్తర్వుల ప్రకారం, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి, రవీందర్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో కట్టుదిట్టమైన పోలీస్ నాకాబందీ నిర్వహించారు. గోదావరిఖనిలోని 5 ఇంక్లైన్, విటల్ నగర్, తిలక్ నగర్ డౌన్, తిలక్ నగర్, రమేష్ నగర్, చంద్రశేఖర్ నగర్, సంతోష్ నగర్, ద్వారకా నగర్ ప్రాంతాల్లో ఒకేసారి నేర నియంత్రణ ముందస్తు చర్యలుగా నాకాబందీ చేపట్టి వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సీఐ–02, ఎస్సైలు 12 మంది, సిబ్బంది 100 మంది పాల్గొన్నారు. ఈ వాహన తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ స్వయంగా పాల్గొని పర్యవేక్షించారు. అక్రమ రవాణా, ప్రభుత్వ నిషేధిత పదార్థాల రవాణా, అనుమానితుల కట్టడి, నేరాల నియంత్రణ, అవాంఛనీయ సంఘటనల నివారణ, దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలను అరికట్టేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గంజాయి సహా ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను కట్టడి చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. నాకాబందీ సమయంలో అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను ఆపి సమగ్రంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ వంటి ధ్రువపత్రాలను పరిశీలించారు. డ్రంక్ అండ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపిన వారు, సరైన ధ్రువపత్రాలు లేని వారిపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో 80 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 3 కార్లపై జరిమానాలు విధించి, వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా వాహనదారుల వివరాలు, వారు వెళ్లే ప్రదేశాలపై సమాచారం సేకరించారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న కూడా ఇలాంటి నాకాబందీ కొనసాగుతుందని, రాత్రి 10 గంటల తర్వాత స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని డీసీపీ తెలిపారు. నూతన సంవత్సరం వేడుకలను కుటుంబ సభ్యులతో ఇంట్లోనే జరుపుకోవాలని, అనవసరంగా రోడ్లపైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత తాత్కాలిక ఆనందాల కోసం తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఇలాంటి తనిఖీలు మరింత కఠినంగా కొనసాగుతాయని, ప్రజలు పోలీసులకు సహకరించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు. Follow us on Website Facebook Instagram YouTube