BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 24 February 2026, 07:42 am
Posted by : NTODAY NEWS OFFICIAL

రజక కుటుంబంపై దాడి ఘటన

తెలంగాణ
24 Feb, 2026 - 07:42 AM
255 వీక్షణలు
రజక కుటుంబంపై దాడి ఘటన: నిందితుల అరెస్టుకు కోహెడలో నిరసన NTODAY NEWS: సిద్దిపేట జిల్లా, కోహెడ ప్రతినిధి రమేష్ నాగర్‌కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో జరిగిన దాడి ఘటనపై కోహెడ మండలంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రెండు నెలల బాలిక మృతి చెందిన ఘటనలో నిందితులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కోహెడ మండల రజక సంఘం అధ్యక్షుడు నంగునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని కోరారు. బాధిత కుటుంబం దేవాలయ దర్శనం అనంతరం బయటకు వస్తున్న సమయంలో జరిగిన దాడి అత్యంత దారుణమని పేర్కొన్నారు. ఈ ఘటనపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్న పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారుల వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరిపించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Kohheda #Siddipet #Protest #SocialJustice #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube