BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 16 March 2026, 08:39 am
Posted by : V శ్రీనివాస్

బీసీ మహిళలకు సబ్ కోట కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

తెలంగాణ
/ మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
16 Mar, 2026 - 08:39 AM
148 వీక్షణలు

బీసీ మహిళలకు సబ్ కోట కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాలి: జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్

తేదీ: 16 మార్చి, 2026

మంచిర్యాల: చట్టసభల్లో మహిళలకు కల్పించే రిజర్వేషన్లలో సామాజిక న్యాయం సాధించాలని, వెనుకబడిన వర్గాలకు (బీసీ) చెందిన మహిళలకు సబ్ కోట కల్పించేలా బిల్లును రూపొందించాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఎలాంటి ఉపకోట లేకపోవడం వల్ల బీసీ మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 1952వ సంవత్సరం నుండి ఇప్పటివరకు అసెంబ్లీకి 94 మంది మహిళలు ఎన్నికైతే, అందులో అగ్రకులాల మహిళలు 54 మంది ఉన్నారని, బీసీ మహిళలు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఉండటం స్పష్టమైన వివక్ష అని వారు ప్రశ్నించారు. రాష్ట్ర జనాభాలో కేవలం 2 శాతం ఉన్న అగ్రకుల మహిళలు 54 మంది ఎన్నికైతే, 30 శాతానికి పైగా ఉన్న బీసీ మహిళలు కేవలం ఎనిమిది మంది మాత్రమే ఎన్నికవ్వడం సామాజిక అన్యాయమని మండిపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు ఉపకోట ప్రకటించాలని, లేనిపక్షంలో మహిళా లోకాన్ని జాగృతం చేసి రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, జిల్లా నాయకులు గజ్జెల్లి వెంకన్న, వేముల అశోక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: శ్రీనివాస్,